Home  »  TV News  »  Jayam serial : జయ జాతకంలో షాకింగ్ నిజాలు.. రుద్రకు అందిన కీలక సమాచారం!

Updated : Aug 15, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -347 లో.....పంతులు జయ జాతకం చూసి చికాకుల ఉన్నాయని చెప్తాడు. మళ్ళీ ఇంటి గురించి చెప్తాడు. ఈ ఇంటికి అంతర్గత శత్రువులు ఉన్నారని చెప్తాడు. పంతులు వెళ్ళాక నేను చెప్పాను కదా జాతకాలు అంటూ టైమ్ వేస్ట్ చేశారని విశ్వ కోప్పడతాడు. బాబాయ్ నువ్వేం టెన్షన్ పడకు నేను పంతులు దగ్గరికి వెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. ఈ ఒక్కసారి నన్ను నమ్ము అని వీరు రిక్వెస్ట్ చేస్తాడు.

దాంతో విశ్వ సరే అంటాడు. ఆ తర్వాత గంగ, జయ మాట్లాడుకుంటారు. ఏంటి గంగ ప్లాన్ చేసి మరి పంతులిని పిలిపించావ్.. ఫెయిల్ అయిందా అని అంటుంది. తనకి కౌంటర్ వేసేలా గంగా మాట్లాడేసరికి బాగా పొగరు అని జయ అనగానే గంగ తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత వీరుకి తను బంధించిన ఆఫీస్ బాయ్ తప్పించుకున్నాడని ఫోన్ వస్తుంది. దాంతో వీరు టెన్షన్ పడుతాడు. ఎలాగైనా సరే అతన్ని పట్టుకోండి అంటాడు.

మరొకవైపు కార్తీక్ మక్కం కలిసి ప్రమీల కోసం వెయిట్ చేస్తారు. మార్ట్ డెవలప్ గురించి ప్లాన్ చేస్తారు. ప్రమీల వచ్చేలోపు కార్తీక్ ఒక లెటర్ రాస్తాడు. ఒకసారి చూపించండి అని మక్కం తీసుకోబోతుంటే అప్పుడే అది కిందపడుతుంది. ప్రమీల వచ్చి చదువుతుంది. ఇది ఎవరిది అని అంటుంది. అప్పుడే పక్కన లవర్స్ మాట్లాడుకుంటారు. వాళ్లదేమో అని ప్రమీల అంటుంది. మరొకవైపు రుద్ర కార్ కి అడ్డుగా ఆఫీస్ బాయ్ వస్తాడు. ఏమైంది ఎవరు నువ్వు అని రుద్ర అడుగుతాడు. నేను ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తాను.. రాబోయే బాక్సింగ్ పోటీలో గంగ అనే అమ్మాయిని ఓడించడానికి కుట్ర చేస్తున్నారు సర్ అని అతను చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Jayam, Zee Telugu Serials, Jayam Latest Episode, Ganga, Rudra






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.